Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' మూడో సాంగ్ కి డేట్ లాక్ 7 d ago

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు'. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం తో దీనిపై భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం మే 9, 2025న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి, వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా, ప్రస్తుతం మూడో పాటను ఏప్రిల్ 10న విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది